ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 : గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.15 కోట్లతో ఉట్నూర్‌తోపాటు ఏటూరునాగారంలో కొత్తగా ఐటీడీఏ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. పోడు భూములపై కమిటీ ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి, పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, ప్రేమ్‌సాగర్ రావు, కోవ లక్ష్మి పాల్గొన్నారు.