హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బీసీ ‘ఏ’ గ్రూపులోని అనాథలను గుర్తించడానికి ప్రస్తుతమున్న 10 ఏం డ్ల వయస్సు నిబంధనను 49 ఏండ్లకు పెంచాలని బీసీ కమిషన్ యోచిస్తున్నది. ఈ అంశంపై 24న బహిరంగ విచారణ చేపట్టి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది.
కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు ఖైరతాబాద్ కా ర్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. బీసీ ‘డీ’ గ్రూప్ లో సాతాని(చాత్తాద శ్రీవైష్ణవ) కుల ప్రతినిధులు తమ కులం పేరు నుంచి సా తాని పదాన్ని తొలగించాలనే వినతిపై విచారణ చేపట్టి అభిప్రా యాలను సేకరించాలని భేటీలో నిర్ణయించారు. కేంద్ర ఓబీసీ జాబితాలోని 40 బీసీ కులాలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీ కి తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాల ని కమిషన్ నిర్ణయించింది. సమావేశంలో సభ్యులు జయప్రకాష్, బాలలక్ష్మి, సురేందర్, బాలమాయాదేవి పాల్గొన్నారు.