పాలిటెక్నిక్‌లో సగం ఖాళీలే.. 59 కాలేజీల్లో 1,586 పోస్టులు వేకెంట్
ఓ వైపు ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల జోరు నడుస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు సహా రాష్ట్రంలోని 59 కళాశాలల్లో 1,586 ఖాళీలు(41శాతం) ఉండగా రెండున్నరేండ్ల నుంచి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా నింపలేదు.
- ఇదీ ప్రభుత్వ కళాశాలల పరిస్థితి
- రెండున్నరేండ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని కాంగ్రెస్ సర్కార్
- అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు సహా 41శాతం ఖాళీ
హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : ఓ వైపు ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల జోరు నడుస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు సహా రాష్ట్రంలోని 59 కళాశాలల్లో 1,586 ఖాళీలు(41శాతం) ఉండగా రెండున్నరేండ్ల నుంచి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా నింపలేదు. సీట్ల ఎంపిక విషయంలో విద్యార్థులంతా ప్రైవేట్‌ను కాదని సర్కార్ కళాశాలలకు జైకొడుతుంటే, ప్రభుత్వ పట్టింపులేమితో 25శాతం బోధన, 55శాతం బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. రెగ్యులర్‌తో పాటు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు కూడా ఖాళీగా ఉండటం గమనార్హం.
సర్కార్ కాలేజీలకే డిమాండ్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల మంచి డిమాండ్ ఉన్నది. రాష్ట్రంలో 128 పాలిటెక్నిక్ కాలేజీలుండగా, 59 ప్రభుత్వ, 67 ప్రైవేట్, రెండు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. సీట్ల భర్తీని పరిశీలిస్తే 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కువగా సీట్లు నిండాయి. సర్కార్ కాలేజీల్లో 14,322 సీట్లుంటే 11,267 సీట్లు నిండాయి. అదే ప్రైవేట్ కాలేజీలో 14,640 సీట్లకు 8,464 సీట్లు మాత్రమే నిండాలి. ప్రభుత్వ కాలేజీల్లో 21శాతం సీట్లు మాత్రమే ఖాళీగా ఉండగా, అదే ప్రైవేట్‌లో 42శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. పరిస్థితులిలా ఉంటే కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత సమస్య వేధిస్తుండటం గమనార్హం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.
ఖాళీలు ఇలా..
- 200 హెచ్‌వోడీ పోస్టులుంటే 87, సీనియర్ లెక్చరర్ పోస్టులు 44 ఖాళీగా ఉన్నాయి.
- 1,172 లెక్చరర్ పోస్టులకు గాను 960మంది పనిచేస్తుండగా, 212 ఖాళీగా ఉన్నాయి.
- లైబ్రేరియన్ 49 పోస్టులుండగా, 12 ఖాళీగా ఉన్నాయి.
- ఫిజికల్ డైరెక్టర్(పీడీ) 43 పోస్టులుంటే కేవలం ముగ్గురే పనిచేస్తున్నారు. సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 3 ఉంటే ఒకటి ఖాళీగా ఉంది.
- గెస్ట్ ఫ్యాకల్టీ కింద 135 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసుకునే అవకాశమున్నది. ప్రస్తుతం 124 పోస్టుల్లో మాత్రమే గెస్ట్ లెక్చరర్లుండగా, 11 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

