హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ( Education System ) భ్రష్టు పట్టిస్తుందని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
( Talasani Srinivas Yadav ) ) ఆరోపించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
పద్మారావు నగర్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుందని ఆరోపించారు. జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన ఆస్తుల కోసం ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. పరిపాలన చేతగాక, పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ లు కట్ చేస్తున్నారని వెల్లడించారు.