Nepal Floods: నేపాల్ టన్నెల్లో సజీవంగా చైనీస్ దేశస్థుడు.. శిథిలాల కింద ప్రాణాలతో 64 ఏళ్ల మహిళ
Nepal Floods: త్రిశూలీ టన్నెల్ నుంచి ఓ చైనీస్ దేశస్థుడిని ఇవాళ కాపాడారు. ప్రస్తుతం టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 10వ రోజు చైనా దేశస్థుడిని ఓ టన్నెల్ నుంచి రక్షించారు.
కాట్మాండు: నేపాల్‌లో వరద(Nepal Floods)ల్లో చిక్కుకున్న మరో ఇద్దర్ని ఇవాళ రక్షించారు. త్రిశూలీ టన్నెల్ నుంచి ఓ చైనీస్ దేశస్థుడిని కాపాడారు. వరదలు సంభవించిన పది రోజుల తర్వాత ఆ చైనా దేశస్థుడు టన్నెల్లో సజీవంగా ఉన్నాడు. చికత్స కోసం అతన్ని కాట్మాండుకు తరలించినట్లు నేపాలీ ఆర్మీ ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న జలవిద్యుత్తు టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు భారీ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు 900 మంది కార్మికులు వివిధ టన్నెల్స్‌లో ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీన సంభవించిన నేపాల్ జల విలయంలో సుమారు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 5 వేల మంది మిస్సింగ్ అయ్యారు.భారత, నేపాలీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. శుక్రవారం 9వ రోజు ఇద్దరు నేపాలీ దేశస్థులను త్రిశూలీ టన్నెల్ నుంచి సజీవంగా రక్షించిన విషయం తెలిసిందే.
VIDEO | Nepal: A Chinese national rescued from the tunnel of flood-affected Upper Trishuli 1 Hydropower Project.
(Source: Nepal Army)
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/1frBql8iiO
— Press Trust of India (@PTI_News) September 5, 2026
నువాకోట్ పట్టణంలో పూర్తిగా దెబ్బతిన్న ఓ ఇంటి నుంచి ఓ మహిళను కూడా నేపాల్ ఆర్మీ రక్షించింది. 64 ఏళ్ల చండికా శ్రేష్ట అనే మహిళ ఆ ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బేత్రావతిలో ఇంటి శిథిలాల కింద నుంచి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఆ మహిళ మొత్తం బురదతో నిండిపోయింది.
BREAKING: Ten days after the devastating Bhote Koshi flash flood, a woman has been rescued alive from beneath flood debris in Betrawati, Nuwakot.
Video courtesy: Armed Police Force, Nepal. pic.twitter.com/6hBzcTtxsC
— Everest Today (@EverestToday) September 5, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

