KTR | యూత్ డిక్లరేషన్లో 24 హామీలు ఇచ్చారు.. ఒక్కటంటే ఒక్కటి అమలు కూడా చేయలేదని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని డైలాగులు కొట్టారు.. 1000 రోజులు అయిపోయింది.. 100 రోజులకు 10 రెట్లయింది.. ఏం చేసినవయా..? చెప్పు అంటే ఏమీ లేదన్నారు.
బకాసురుల్లాగా మేస్తున్నరు.. కుంభకర్ణుల్లాగా పంటున్నరు.. పందికొక్కుల్లాగా తింటున్నరు… అది తప్ప ఏదీ లేదు చేసింది.. ఇక మీదికెళ్లి.. తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నారు.. ఎవరు చేయాలే.. ఎందుకు చేయలే రాజీనామా..? అని నేను అడుగుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాల్నా.. మీరు చెప్పాలే.. ఎవరు చేయాలే రాజీనామా.. అని కేటీఆర్ అడిగితే.. విద్యార్థులంతా ముక్తకంఠంతో రేవంత్ రెడ్డి అంటూ సమాధానమిచ్చారు. 100 రోజులు అని చెప్పి 1000 రోజులు మోసం చేసిన ధోకేబాజ్ (మోసగాడు)రాజీనామా చేయాల్నా లేదా.. అని అడిగారు. నిరుద్యోగులను నిండా ముంచిన లఫంగా పార్టీ కాంగ్రెస్ ఇయ్యాళ్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందన్నారు.
ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పేద ప్రజల భూములతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోంది. కోట్ల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. మీ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజు దగ్గరలో ఉందని కేటీఆర్ హెచ్చరించారు. 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలిస్తాం.. అని మా తమ్ముళ్లు, చెల్లెళ్లను మోసం చేసి వాళ్లు పోయి వాళ్ల తల్లిదండ్రులు, అత్తామామలు, తాత నాయినమ్మల కాళ్లు మొక్కేటట్టు చేసి కాంగ్రెస్కు ఓటేయించుకుని మోసం చేసినందుకు, బాండ్ పేపర్ రాసి మోసం చేసిన సన్నాసులకు తప్పకుండా భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
యూత్ డిక్లరేషన్లో 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు
100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు.. 1000 రోజులు అయింది
బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదు
మళ్లీ కేసీఆర్ రాజీనామా చేయాలని… pic.twitter.com/fkoXm3bapf
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026