హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ) : సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిముద్దవుతున్నది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం లబోదిబోమంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతన్న కన్నీటి వేదనే కనిపిస్తున్నది.
గడిచిన 20 రోజులుగా అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను సివిల్‌సైప్లె అధికారులు పట్టించుకోకపోగా, ధాన్యాన్ని కాపాడేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయి నష్టం వస్తుందని తెలిసినా నింపాదిగా ధాన్యం కొనుగోళ్లు చేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. ధాన్యం వరదలో కొట్టుకుపోతుంటే.. వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యానికి ధాన్యం కొనుగోళ్ల లెక్కలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. లక్ష్యం కొండంత ఉండగా కొన్నది మాత్రం కొసరంత ఉన్నది. ఈ యాసంగిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 130 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకు కేవలం 55.97 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే మొత్తం ధాన్యంలో ఇది సగం మాత్రమే. మార్చి 20వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించినట్టు చెప్పిన సివిల్ సైప్లె అధికారులు రెండు నెలలు గడుస్తున్నా సగం కూడా కొనలేదు.
అకాల వర్షాల అంచనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయండంటూ రైతులు కోరినా అధికారులు కాంట పెట్టలేదు. నెలల పాటు కొనుగోలు కేంద్రాల్లోనే మూలిగిన ధాన్యం చివరికి వర్షార్పణం అవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీలు, వేయింగ్ మిషన్లు, తేమ చూసేందుకు మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో లేకపోవడం కూడా కొనుగోళ్ల ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది. మరోవైపు కొర్రీలు పెడుతూ ధాన్యం కొనకపోవడంతో రైతాంగం కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తున్నది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2.87 లక్షల మంది రైతుల నుంచి 18.47 లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించింది. ఇందుకు గానూ రైతులకు బోనస్ కింద రూ. 923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రైతులకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం.
హైదరాబాద్, మే 21 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మారెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని, కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పు డు మిల్లులకు తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇ బ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యం లో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాల కు ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు వ ర్షాల నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సి ద్ధంగా ఉంచినట్టు తెలిపారు. అగ్నిమాపక శాఖ సి బ్బందికి కూడా అవసరమైన శిక్షణనందించి అం దుబాటులో ఉంచినట్టు తెలిపారు.
నమస్తే నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీవర్షం కురిసింది. దీంతో ఆయా చోట్ల పలు కా లనీలు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి, ఇల్లంతకుం ట మండలం పొత్తూరు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, రుద్రంగి మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ధాన్యం కుప్పలు తడిశాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిన వరిధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కా మారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రోడ్లపైనే మురుగు, వరద పారడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. నగర పాలక సంస్థ కార్యాలయంలో నే వరద గంటపాటు నిలిచిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. షాషాబ్‌గుట్టలో నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, అధికారులతో కలిసి కలెక్టర్ విజయేంద్రబోయి పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారంలో, ఆత్మకూర్.ఎస్ మండలంలో ఏపూరులో వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. నల్లగొండ మండలం అప్పాజీపేట పరిధిలోని బంటుగూడెం గ్రామంలో పిడుగుపాటుకు మహిళా రైతు మృతిచెందింది. పెదఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు గ్రామంలో రెండు ఆవులు మృతి చెందగా మరో ఇద్దరు సృహ తప్పి కింద పడిపోయారు. మహబూబాబాద్ జిల్లా పెదవంగర మం డలం బొమ్మకల్లు, దంతాలపల్లి మండల కేంద్రం తో పాటు వేములపల్లి, పెద్దముప్పారం, రేపోణి గ్రా మాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి నీటిపాలైంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ వరద నీటితో చెరువులా మారిం ది. నెక్కొండ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధా న్యం నీటిపాలైం ది. మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండలం గుండెంగలో పిడుగుపాటకు మై దం ప్రవీణ్(30), కొత్తగూడ మండలం ఓటాయికి చెందిన గొర్రెల కాపరి ఏశబోయిన చేరాలు(60) పిడుగుపడి మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షంతో అపార నష్టం వాటిల్లింది.