హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): యాదవులు ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని యువజన, సాంస్కృతిక, టూరిజం డెవలప్మెంట్ శాఖలను ఆదేశించింది. దీంతో ఇక నుంచి సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపనున్నారు.
జీపీ సెక్రటరీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బలరాం
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ సెక్రటరీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సందిళ్ల బల రాం, కార్యదర్శిగా పీ వెంకటరమణ ఎన్నికయ్యారు. శనివారం నాంపల్లి టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో 36 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేని, అసోసియేట్ అధ్యక్షుడు ము త్యాల సత్యనారాయణగౌడ్ సమావేశంలో పాల్గొని సెక్రటరీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.