ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 16:43:41

ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం : సీఎస్‌

ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం : సీఎస్‌

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ యువత వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు అవసరమైన సహాయం అందించడంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో డీఐసీసీఐ (దళిత్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ) బృందం సీఎస్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల యువత పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నదని అన్నారు.

డీఐసీసీఐ ద్వారా వ్యవస్థాపకతను పెంపొందించేందుకు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. వివిధ పరిశ్రమల్లో సృజనాత్మక ఆలోచనలు అమలు చేస్తున్న డీఐసీసీఐని సీఎస్ అభినందించారు.  ప్రభుత్వం సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ ఇన్నోవేషన్ ద్వారా యువతకు విజయవంతంగా శిక్షణను అందిస్తుందన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో పరిశ్రమల రంగం గణనీయ పురోగతి సాధించిందన్నారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు కృషిచేయాలని సీఎస్ వారిని కోరారు. డీఐసీసీఐ ప్రతినిధులు అరుణ దాసరి, రవి కుమార్ నర్రా, రాహుల్ కిరణ్, సురేశ్‌ నాయక్,  మున్నయ్య తమనం, మునీంధర్, రమేశ్ నాయక్, వెంకటేశ్వర్ రావు, పరమేశ్ పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.