హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీస్ పర్సనల్ విభాగం ఏడీజీపీగా సౌమ్యమిశ్రాను నియమించింది. డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా వీబీ కమలాసన్ రెడ్డిని, ఇప్పటివరకు క్రైమ్స్, సిట్ అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరించిన ఏఆర్ శ్రీనివాస్‌ను ఏసీబీ డైరెక్టర్‌గా, హోంగార్డు, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అంబర్ కిశోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా పీ శబరీష్‌ను బదిలీ చేస్తూ బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.