హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జోగారెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రెండు నెలల క్రితం ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన జోగారెడ్డి పదవీకాలం అక్టోబర్ 31కి ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని 2026 ఏప్రిల్ వరకు పొడిగించింది. ఉద్యోగ విరమణ చేసిన వారి పదవీకాలాన్ని పొడిగించబోమని రేవంత్రెడ్డి సర్కారు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.