ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం విరివిగా నిధులు వెచ్చిస్తున్నదని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రూ.8.90 కోట్లతో 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం శుక్రవారం పట్టణంలోని రెండుచోట్ల స్థలాలను పరిశీలించారు.