రాయికల్, మే 21 : మక్కల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మారెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మారెట్లో 40 వేల క్వింటాళ్ల ధాన్యం ఉంటే.. తూకం వేసింది కేవలం 20 వేల బస్తాలు మాత్రమేనని మండిపడ్డారు. లారీల కొరతవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్, మార్ఫెడ్ ఎండీ, డీఎంలతో ధాన్యం కొనుగోలులో తలెత్తుతున్న సమస్యలపై ఫోన్లో మాట్లాడారు. రైతులు వారి సమస్యలపై జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులకు ఫోన్ చేస్తే ఎత్తకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జగిత్యాల మారెట్లో వెజ్, నాన్ వెజ్ మారెట్ గోదాములు అందుబాటులో ఉన్నా వాటిని వాడడంలేదని, గోదాములు ఎకడ ఇచ్చినా ధాన్యం రవాణా చేయాలి అని కోరారు. లారీల సమస్య పరిషరించడంతోపాటు, ప్రతిరోజూ వెజ్ పరిమితిని పెంచుతామని మార్ఫెడ్ ఎండీ హామీ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో పనిచేయలేం! ; సమస్యలపై తొర్రూర్ సొసైటీ చైర్మన్ హరిప్రసాద్‌కు సిబ్బంది వినతి
తొర్రూరు, మే 21 : కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలతో తాము సతమతమవుతున్నామని, పని చేసే పరిస్థితి లేదని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్ సిబ్బంది చేతులెత్తేశారు. గురువారం వారు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ.. తొర్రూరు డివిజన్ లో ధాన్యం, మకజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ధాన్యం అందుబాటులో ఉన్నా అవసరమైన సామగ్రి అందుబాటులో లేక కాంటా వేయలేకపోతున్నట్టు పేర్కొన్నారు. కాంటా వేసిన బస్తాలను గోదాములకు తరలించేందుకు లారీలు రాకపోవడం, గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో నిల్వ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. గన్నీ బ్యాగుల సరఫరా సక్రమంగా లేకపోవడం, రవాణా కోసం వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బస్తాల షిఫ్టింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. కొనుగో లు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిషరించాలని వినతిపత్రంలో కోరారు.