షాబాద్, జూలై 13: షాబాద్లో హత్యకు గురైన బాలిక కుటుంబంలో మిగిలిన యువతికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. షాబాద్లో సోమవారం రాత్రి మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి చెందిన దివ్యాంగురాలు మేఘనకు రూ.10లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కు టుంబసభ్యులు పోలీసుల వైఫల్యమే ఈ ఘటనకు కారణమంటూ కలెక్టర్, విప్, ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేఘనకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. మేఘనకు పునరావాస కేంద్రంలో వైద్యం మానసిక వికాసానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్ర స్తుతం మేఘనకు దివ్యాంగ పింఛన్ రూ.4వేలు వస్తున్నదని, దీంతో పాటు నాన్నమ్మకు వచ్చే ట్రాన్స్కో డిపార్ట్మెంట్ పింఛన్ కూడా వచ్చేలా చూస్తామని హామీఇచ్చారు.