బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 21:13:45

పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు

పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : గ్రామీణ ప్రజా వైద్యంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 48 ఉప ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.7 కోట్ల 68 లక్షలు మంజూరు చేసిందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులతో ఉప ఆరోగ్య కేంద్రాల భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు వీలుగా మొదటి విడుతగా రూ. 2 కోట్ల 30 లక్షల 40 వేలను విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిందన్నారు. పక్క భవనాల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయని మంత్రి తెలిపారు. 

ఇవి కూడా చదవండి..

కూల్‌డ్రింక్‌ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది

పద్య ప్రక్రియను ‌ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన

క‌రోనా దెబ్బ‌.. మరో 12 కోట్ల మంది పేద‌రికంలోకి.. 

రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం 

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి 

VIDEOS

logo