హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ప్రారంభించింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు బడ్జెట్ అంచనాలను ఈ నెల 4 తేదీలోపు సమర్పించాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశించారు. ఆయా శాఖల అంచనా వ్యయాలు, వివిధ పథకాల కోసం అవసరమైన వనరుల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు ఆన్లైన్లో నిర్దేశించిన ఫార్మాట్లో పంపించాలని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని శాఖలకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.ఆర్థిక సమతుల్యతను, సుస్థిరతను నిలుపడం ప్రధాన లక్ష్యాలుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నట్టు సీఎంవో మంగళవారం తెలిపింది. కొత్తరేషన్ కార్డు లు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12,000 ఆర్థికసాయం, బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరి గుట్ట ఆలయ బోర్డుపై చర్చించనున్నట్టు సమాచారం.