హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : బస్వాపూర్ రిజర్వాయర్ సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11.39 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టుకు 2017లో అప్పటి సర్కార్ రూ. 1,751 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
అయితే భూ సేకరణను చేర్చకపోవడం, వర్క్ కాంపోనెంట్ల ధరలు పెరుగడంతో రూ. 1,751 కోట్ల నుంచి రూ. 2,670 కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ మేరకు గురువారం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది.