హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎత్తిపోతల పథకాల సలహాదారుడిగా పెంటారెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంటారెడ్డి పదవీకాలం మే15తో ముగిసింది. అసెంబ్లీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ప్రసన్నకుమార్, ఇరిగేషన్‌శాఖ సలహాదారుడిగా ఆదిత్యనాథ్‌దాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సలహాదారుగా శ్రీనివాసరాజును నియమించింది.