ఓదెల, డిసెంబర్ 20: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడినైన తనకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మద్దతు ఇవ్వలేదని ఓదెల మండలం మడకకు చెందిన గోశిక రాజేశం ఆరోపించారు. శనివారం మడకలో భార్యతోపాటు ఎస్సీ కులస్తులతో కలిసి కాంగ్రెస్ పెద్దల ఫ్లెక్సీని రక్తంతో కడిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే తనకు కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్‌కు మద్దతు ఇచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో విద్యార్థి దశ నుంచి పని చేస్తున్నానని చెప్పాడు. గ్రామంలో భూస్వాములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిపై పోరాటం చేసినందుకు తనపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లాలనే ఈ నిరసన చేపట్టినట్టు తెలిపారు.