కొల్లాపూర్, ఫిబ్రవరి 22 : మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని నల్లమలలో శివస్వాములు దారి తప్పిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్‌తోపాటు మరికొందరు స్వాములు మల్లేశ్వరం మీదుగా కాలినడకన శుక్రవారం శ్రీశైలం బయలుదేరారు. సెల్‌ఫోన్‌లోని గూగుల్ మ్యాప్‌లో షార్ట్‌కట్ వెళ్లేందుకు సర్చ్ చేశారు.
మ్యాప్‌ను అనుసరిస్తూ అడవిలో ఎనిమిది గంటలు ప్రయాణం చేసి దారితప్పినట్టు గుర్తించి 100 నంబర్‌కు డయల్ చేశారు. ఏపీ పోలీస్, ఫారెస్టు అధికారులు రాత్రి శివ స్వాములను గుర్తించి ఆత్మకూరు నియోజకవర్గం వెంకటాపురంలో వదిలిపెట్టారు.