శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 01:35:46

కేసీఆర్‌ కిట్‌తో సత్ఫలితాలు

కేసీఆర్‌ కిట్‌తో సత్ఫలితాలు
  • కేంద్ర బృందం సభ్యుల ప్రశంస

సిరిసిల్ల టౌన్‌/ వేములవాడ: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం సత్ఫలితాలను ఇస్తున్నదని జాతీయ ఆరోగ్య మిషన్‌ విభాగం అధికారులు డాక్టర్‌ లేఖసుమయ, కవిత ప్రశంసించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానను, వేములవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం వారు సందర్శించారు. వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డయాలసిస్‌సెంటర్‌, ఐసీ యూ, నవజాతశిశు కేంద్ర, బ్లడ్‌బ్యాంక్‌ వంటివి  జిల్లాప్రజలకు  అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. వేములవాడ ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలు, వైద్యుల పనితీరును  పరిశీలించారు. వీరివెంట డీపీఎంవో ఉమాదేవి, వైద్యాధికారులు మహేశ్వరరావు, మానస, పర్యవేక్షకులు సురేందర్‌, జయప్రకాశ్‌నారాయణ, తదితరులు ఉన్నారు. logo