హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): విత్తన స్వయం సంవృద్ధి లక్ష్యంగా ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతులను గుర్తించి వారికి మేలు రకపు విత్తనాలు అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు ఐదు ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న) విత్తనాలు 11వేల గ్రామాల్లో 40వేల మందికి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ విత్తనాల ఖర్చును రైతుల నుంచే వసూలు చేస్తారని తెలిసింది.