హైదరాబాద్ : పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో కొత్తగా ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (IHFMS) పాలసీని ఆవిష్కరించింది. బెడ్ ఒక్కంటికీ నెలకు చేసే ఖర్చును రూ.7500 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లను వర్తింపజేస్తూ తాజాగా.. ప్రభుత్వం జీవో 31ను విడుదల చేసింది.
గతేడాది నమోదైన బెడ్ ఆక్యుపెన్సీ లేదంటే మంజూరైన పడకల సంఖ్యలో 50శాతం వీటిలో ఏది ఎక్కువ అయితే.. దాని ఆధారంగా రికనబుల్ బెడ్ స్ట్రెంత్ (RBS)ను నిర్ణయించాలి. ప్రస్తుతం ప్రతి 7వేల స్క్వేర్ ఫీట్ల బిల్డప్ ఏరియాకు ఒకరిని, ఓపెన్ ఏరియా అయితే 27వేల స్క్వేర్ ఫీట్లకు ఒకరిని నియమించే విధానం ప్రస్తుతం అమలులో ఉది. మెడికల్ కాలేజీలకు వర్తించే ఈ విధానాన్ని నర్సింగ్ కాలేజీలకు.. నర్సింగ్ పాఠశాలలకు (హాస్టల్స్‌తో సహా) కూడా విస్తరించింది. 200 ఆపై పడకలు ఉన్న దవాఖానకు ప్రత్యేకంగా టెండర్లు పిలువాలి.
200లోపు పడకలు ఉన్న దవాఖానలకు వీలైనంత వరకు కలిపి టెండర్లు పిలువాలి. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ టెండర్లను జిల్లాస్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా ఆరోగ్య సంఘం ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఏజెన్సీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. పారిశుధ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను పాటించేలా కార్యకులకు నైపుణ్యం పెంపులలో ఆరోగ్యశాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్యసేవల మౌలిక సదుపాయాల
అభివృద్ధి సంస్థ సహాయం చేయనున్నాయి.