Cancer | (స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్ డెరాక్స్టెకన్, ఓసిమార్టినిబ్, డుర్వాలుమాబ్పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. వీటిపై గతంలో కస్టమ్స్ సుంకం 10 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని సున్నాకు స్థిరీకరించారు. అలాగే మెడికల్ ఎక్స్-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్రే ట్యూబ్లు, ఫ్లాట్ ప్యానల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కుదించారు.