హైదరాబాద్, సెప్టెంబర్ 21: భారత్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటైన హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ రొమ్ము క్యాన్సర్ రోగులకు శుభవార్త చెప్పింది. భారతీయులకు అధునాతన క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ‘పెర్జియా’ ఇంజెక్షన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ‘పెర్టుజుమాబ్’ ఇంజెక్షన్‌కు సరసమైన బయోసిమిలర్. హెచ్ఈఆర్-2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఈ ఇంజెక్షన్‌ను ఎంజీన్ బయోసైన్సెస్ లిమిటెడ్ సహకారంతో మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు హెటిరో సంస్థ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి దేశంలోని క్యాన్సర్ రోగులకు అత్యంత నాణ్యమైన ఆంకాలజీ చికిత్సలను, ప్రాణరక్షక ఔషధాలను సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావాలన్న హెటిరో నిబద్ధతను ఈ భాగస్వామ్యం బలోపేతం చేస్తుంది. ‘పెర్టుజుమాబ్’ అనేది ఓ మోనోక్లోనల్ యాంటీబాడీ. హెచ్ఈఆర్-2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స కోసం ‘ట్రాస్టుజుమాబ్’, కీమో థెరపీతో కలిపి ఉపయోగించదగిన ఆరోగ్య సంరక్షణ ప్రమాణంగా ‘పెర్టుజుమాబ్’ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.