ఖైరతాబాద్, ఆగస్టు 8 : ప్రతి ఒక్కరిలో సొంత ఇంటిలో నివాసించాలన్న ఆశ ఉంటుంది.. ఆ ఆశను లైట్ హౌజ్ ప్రాపర్టీస్ సాకారం చేస్తున్నది. 2012లో ప్రారంభించిన లైట్ హౌజ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాలను అందించడంలో లైట్ హౌజ్ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. కమిట్మెంట్, ఎక్స్పర్ట్ టీమ్, నైపుణ్యం కలిగిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.. ఇలా నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉంటూ.. వారి సొంతింటి కలను నిజం చేయడంలో భాగస్వాములవుతున్నారు. వినియోగదారులు ఇంటి సొంతం చేసుకునేందుకు ఆర్థిక, న్యామమైన సహకారాన్ని అందించడంతోపాటు కొనుగోలు చేసిన వారికి సర్వీసును అందిస్తోంది.
లైట్ హౌజ్ ప్రాపర్టీస్ చందానగర్, బీహెచ్ఈఎల్, అమీన్‌పూర్‌లలో విలాసం అపార్ట్మెంట్స్ పేరుతో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో అధునాత సౌకర్యాలు నివాసితులకు సురక్షితమైన, సంతృప్తికరమైన అనుభూతిని అందిస్తుంది. లిఫ్ట్, 24/7 సెక్యూరిటీ, సీసీ కెమరాలు, సోలార్ ఫెన్సింగ్, కారు పార్కింగ్, ఈవీ చార్జింగ్ పాయింట్లు, పార్కు, మంచినీటి సరఫరా, యోగా, ధ్యానం, క్రీడామైదానం సౌకర్యాలు ఉన్నాయి.
లైట్‌హౌస్ ప్రాపర్టీస్ కేవలం ప్రాజెక్టులే కాదు మార్కెటింగ్ రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తున్నది. తాజా మార్కెటింగ్ చేస్తున్న ‘ఫార్మా కౌంటి’ మరో అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్నది. మీర్ఖాన్ పేట, నందివనపర్తిలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. మెట్రోపోలీస్ నుంచి 60కిలోమీటర్ల పరిధిలో దీనిని సిద్ధం చేశారు. డీటీసీపీ ఆమోదించిన ఈ ప్రాజెక్టు స్కిల్ యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్, జనరల్ డెవలప్మెంట్ కంపెనీలు, హెల్త్ సిటీ, లైఫ్ స్పేసెస్ క్లస్టర్ అతి సమీపంలో ఉండడం విశేషం. దీంతోపాటు అమెజాన్ డేటాసెంటర్, ఫాక్స్‌కాన్, 200 ఫీట్ రోడ్, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, మెగా టౌన్షిప్, ఐటీ హబ్స్, ఎలిమినేడు ఏరో స్పేస్, రావిర్యాల టోల్, గురునానక్ కాలేజ్ ఈ-సిటీ సెజ్ లాంటి అతి దగ్గరలోనే ఉండడం మరో విశేషం.
– చైర్మన్ అండ్ సీఎండీ మంజునాథ్ రెడ్డి