Gold rates: బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారంపై రూ.100 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా దాదాపు అంతే మొత్తం తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.57,700 గా, 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.62,950 గా ఉంది. అదేవిధంగా దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ బంగారం ధర రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ బంగారం ధర రూ.63,490 ఉంది. ముంబైలో 22 క్యారెట్ ధర రూ.57,700.. 24 క్యారెట్ ధర రూ.62,950 పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ ధర రూ.57,850, 24 క్యారెట్ ధర రూ.63,100 గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ బంగారం ధర రూ.57,700, 24 క్యారెట్ బంగారం ధర రూ.62,950 గా ఉన్నది. విజయవాడలో కూడా 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ.62,950 ఉంది.
కాగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,600గా ఉంది. పెద్ద నగరాల్లో డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరల్లో నగరాన్ని బట్టి స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజా ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. సాయంత్రం ఈ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు లేదంటే స్థిరంగా కొనసాగవచ్చు.