అచ్చంపేట, మే 29 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు బియ్యం గోదాముపై బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ బృందం ఓఎస్డీ ద్రోణాచార్య ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ప్రభాకర్, వెంకటేశ్వర్రావు, సాంబశివరావు దాదాపు ఐదు గంటలపాటు స్టాక్ పాయింట్లో తనిఖీలు చేపట్టారు. వచ్చిన బియ్యం నిల్వలు, సరఫరా చేసిన వివరాలు పరి శీలించి బియ్యం బస్తాలు లెక్కించారు. వేలిముద్రలు లేకుండా పంపిణీ చేసిన 200 బస్తాలు, ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలు, రికార్డులో నమోదైన స్టాక్‌కు పొంతన లేదని పేర్కొంటూ గోడౌన్‌ను సీజ్ చేశారు.