
హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం మరోమారు భేటీ అయింది. హైదరాబాద్లోని జలసౌధలో ఉపసంఘం భేటీ జరుగుతున్నది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జరుగుతున్న ఈసమావేశానికి బోర్డు సభ్యులు, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నది.
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం ఈ నెల 17, 20 తేదీల్లో కూడా సమావేశమయింది.