GRMB | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభ్యంతరాలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బేఖాతరు చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్ తుది నివేదికను తాజాగా జీఆర్ఎంబీ విడుదల చేసింది. బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్పై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయించేందుకు కృష్ణా బోర్డు సభ్యులు చైర్మన్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరినా పట్టించుకోలేదు. రాష్ట్రం తరఫున మెంబర్‌గా ఉన్న ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ ప్రతిపాదనలను కొట్టిపారేసిన బోర్డు.. గోదావరి బోర్డుకు సంబంధించిన అంశాల్లో వేరే బోర్డు సభ్యులను చైర్మన్‌గా కమిటీని వేయలేమని పేరొంది. దాని ప్రకారం మన అధికారులు పేరొన్న ఎజెండా అంశాలను చర్చించేందుకు నిరాకరించింది. అనుమతి లేని అంశాలను బోర్డులో చర్చించేందుకు తెలంగాణ ప్రయత్నించిందని రివర్స్‌లో ఆరోపించింది. అవసరమైతేనే కమిటీని వేస్తామని చెప్పినట్టు మినిట్స్‌లో రాసుకుంది.
నిబంధనలకు అనుగుణంగానే బోర్డులో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి కేంద్రం రూల్స్ పాటిస్తామని మినిట్స్‌లో బోర్డు చైర్మన్ వెల్లడించారు. సెక్యూరిటీ, క్లీనింగ్ సిబ్బంది సేవలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఒకటేనని, దానిని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ పేరొన్నట్టు మినిట్స్‌లో వెల్లడించారు. మిగతా ప్రాజెక్టులను ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్టు వివరించారు. ఏపీ మాత్రం ప్రాజెక్టులను అప్పగించేందుకు ఓకే చెప్పిందన్నారు. అయితే, ఏపీ మా త్రం మన ప్రాజెక్టులపై మెలికలు పెట్టినట్టు మినిట్స్‌లో స్పష్టమైంది. అన్ని పవర్ ప్రాజెక్టులూ ఏపీ భూభాగంలోనే ఉన్నాయని, తెలంగాణలో ఏమీ లేవని, కాబట్టి దీనిపై తెలంగాణకు ఏ సంబంధమూ లేదని మినిట్స్‌లో పేరొన్నారు.
ఏపీ అధికారులకు ప్రయారిటీ ఏపీ ఉద్యోగులకు అర్హత లేకున్నా బోర్డు ప్రమోషన్లు కల్పించింది. ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తున్న ఏపీ అధికారి ఆర్ శ్రీకాంత్‌రెడ్డికి పూర్తిస్థాయి ఎస్ఈగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు పేరొంది. బోర్డు రూల్స్ ప్రకారం రెండేండ్లు ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తే.. పూర్తిస్థాయి ఎస్ఈగా నియమించేందుకు అవకాశం ఉందని పేరొం ది. ఏపీ కేడర్ డీఈఈ ఎం వేణుగోపాల్ అనే మ రో అధికారికి ఈఈగా అవకాశం కల్పించింది. మన అధికారుల విషయంలో మాత్రం కొర్రీలు పెడుతున్నది. సిబ్బంది కొరత దృష్ట్యా పలువురు అధికారుల డిప్యూటేషన్‌ను పెంచాలని ఈఎన్సీ లేఖ రాసినా బోర్డు కొట్టిపారేసింది.