నిజామాబాద్ : నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. కాగా, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది.
మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరదతో పాత వంతెనకు సరి సమానంగా వరద పారుతున్నది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.