Heavy Rains | కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత పరవళ్లు.. నిండుకుండల్లా మారుతున్న ప్రాజెక్టులు
Heavy Rains | రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి.
Heavy Rains | రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీబ్యారేజ్ ఇన్‌ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం వద్ద కూడా గోదావరిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
ఇక కడెం ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఒక గేటును రెండు అడుగుల మేర ఎత్తి 2,865 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుమ్రంభీం ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 237 అడుగులుగా ఉంది. కుమ్రంభీం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1040 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి ప్రవాహం పెరిగింది. ఇన్‌ఫ్లో 33,050 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1046 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ ప్రస్తుత నీటిమట్టం 1072 అడుగులకు చేరింది.
Read More :
Telangana | రాష్ట్రంలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
Bhadrachalam | భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

