గోదావరి ఎగువ నుంచి దిగువకు తరలిపోతున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమాని గోదావరి తరలిపోతుండగా, ఏపీ ఒడిసి పట్టుకుంటున్నది. దీంతో ఆ ప్రాంతంలోని పరీవాహక ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నది.
నీటిని ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించి దిగువకు నీటిని వదులుతున్నది. దీంతో ఏపీకి జలాలు తరలుతుండగా, వాటితో ఆ రైతాంగం పచ్చని పంటలను కాపాడుకుంటున్నది.