చెంగ్డూ (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా అండర్-17, అండర్-15 జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ తన్వి పత్రి చాంపియన్‌గా నిలిచింది. అండర్-17 విభాగంలో జరిగిన ఫైనల్లో ఒడిషాకు చెందిన తన్వి.. 11-15, 15-10, 15-12తో తోటి షట్లర్ షైనా మణిముత్తును ఓడించి తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది.