హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): 317జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో శాశ్వత పరిషారం చూపుతుందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు.
సమన్వయ సంఘం ప్రతినిధులు ప్రతిపాదించిన ఉద్యోగుల స్థానికత, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, జిల్లాల విభజన, జోన్, మల్టీజోనల్, స్పౌజ్ బదిలీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బాధిత ఉద్యోగ సంఘాల సూచనలు, ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.