హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పనిగంటల పెంపు జీవో-282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్చేశారు. ఆదివారం కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘా లు, ఫెడరేషన్లు, అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే 8 గంటల విధానాన్ని 10 గంటలకు పెంచారని మండిపడ్డారు. సోమవా రం అన్ని జిల్లా కలెక్టరేట్లు, మండల, పారిశ్రామిక ఏరియాలు, హైదరాబాద్ కార్మికశాఖ కార్యాలయం వద్ద జీవో కాపీలను దహనం చేసి.. నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యుత్ ప్రేరణతో వెన్నెముక గాయాలకు చికిత్స!
న్యూఢిల్లీ, జూలై 6: ఏదైనా అనుకోని ప్రమాదంలో వెన్నెముకకు గాయాలు అయితే..ఇక అంతే సంగతి! అతడి శరీరం పూర్వపు కదలికలను పొందటం దాదాపు అసాధ్యంగా మారుతుంది. దీనికి సంబంధించి అక్లాండ్ వర్సిటీ (న్యూజిలాండ్) పరిశోధకులు ఎలుకలపై చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ఆశలు రేపుతున్నాయి. దెబ్బతిన్న వెన్నెపూసపై తిష్టవేసేలా ఒక అత్యంత పలుచని, చిన్నపాటి ‘ఎలక్ట్రిక్ ఇంప్లాట్’ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.