హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వరింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252ను పునఃసమీక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పీ రామచందర్, టీయూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ల కోసం తెచ్చిన జీవో-252లో జర్నలిస్టులను వర్గీకరించడం బాధాకరమని పేర్కొన్నారు. రిపోర్టర్లకు అక్రెడిటేషన్, డెస్ జర్నలిస్టులకు మీడియా కార్డు పేరుతో గుర్తింపుకార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావించడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
సర్కారు విడుదల చేసిన జీవో 252లో అ నేక లోపాలున్నాయని తెలంగాణ వర్కింగ్ జ ర్నలిస్టు ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రిపోర్టర్లు, డెస్క్ జర్నలి స్టులను వేరు చేయడం తగదని సూచించారు.