రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో దుబాయిలో నిర్వహించనున్న గ్లోబల్ పద్మశాలి సమ్మిట్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు అమెరికన్ పద్మశాలీ అసోసియేషన్, దుబాయి నేత ఈవెంట్స్ సంయుక్తంగా ఆయనకు ఆహ్వానం పంపాయి. సమ్మిట్‌లో 12 దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.