AI | వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు..!
వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్ విజన్' అనే పరికరాన్ని అమర్చిన కంటిఅద్దాల్ని ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో 50 మందికి పంపిణీ చేశారు.
- కృత్రిమ మేధతో పనిచేసే కండ్లద్దాలు
- దారి చూపుతుంది.. చదివి వినిపిస్తుంది
- అభివృద్ధి చేసిన బెంగళూరు కంపెనీ
హైదరాబాద్: వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్ విజన్’ అనే పరికరాన్ని అమర్చిన కంటి అద్దాల్ని ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో 50 మందికి పంపిణీ చేశారు. వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు. సందేశాల్ని చదవొచ్చు. నడుస్తుండగా అడ్డొచ్చేవాటిని, ఎదుటి వ్యక్తుల్ని గుర్తించవచ్చు. మల్టీ టాస్కింగ్‌ను ఏకకాలంలో చేపట్టేందుకు ‘స్మార్ట్ విజన్’లో పలు సెన్సార్లను అమర్చారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో ఇది త్రీడీ ఇమేజ్‌లను సృష్టిస్తుంది.
‘స్మార్ట్ విజన్’లో బ్లూటూత్, మైక్రోఫోన్, స్పీకర్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని ఏఐ అప్లికేషన్‌కు అనుసంధానం చేస్తారు. దాంతో కృత్రిమ మేధ సేవలు అంధులకు అందుబాటులోకి వస్తాయి. బ్రెయిలీ లిపిలో ఉన్న బటన్స్‌ను నొక్కటం ద్వారా లేదా వాయిస్ కమాండ్స్ ఇవ్వటం ద్వారా స్మార్ట్ విజన్ సేవల్ని పొందుతారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘విజన్ ఏయిడ్’ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2021లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఫేస్ రికగ్నేషన్, మనుషుల భావాలు, చుట్టుపక్కల ఉండే వాహనాలు, వస్తువులు, ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్..మొదలైనవి పసిగట్టే మెషిన్ లెర్నింగ్‌తో ఏఐని రూపొందించారు. ఈ పరికరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అంధులతో మాట్లాడుతుంది.
ఫీచర్లు..
- ప్రింట్ చేసిన, రాసిన అక్షరాల్ని వివిధ భాషల్లో చదివి వినిపిస్తుంది.
- ‘స్మార్ట్ విజన్’కు అంధులు వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వొచ్చు.
- ముప్పు ఎదురైనప్పుడు.. అలర్ట్ బటన్‌తో బంధువులకు సమాచారం పంపొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

