భూభారతి బిల్లుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయం పూర్తికాకుండానే భూభారతి బిల్లును సభలో ప్రవేశపెట్టాలని మంత్రి పొంగులేటికి స్పీకర్ సూచించారు. దీంతో మంత్రి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావు తరహాలోనే అక్బరుద్దీన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నియమాలకు విరుద్ధంగా బిల్లును ప్రవేశపెట్టడంపై నిలదీశారు.
హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): ‘ఇచ్చిన హామీలన్నీ 10నెలల్లోనే ఎలా అమలు చేస్తాం? మాకు ఇంకా సమయముంది.. ఐదేళ్లలో తప్పకుండా గ్యారెంటీలన్నీ అమలు చేస్తాం” అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ బిల్లులు చెల్లించాలంటే 10శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.