హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇచ్చారనే కారణంతో నిలిపేసిన పలువురు ఇంజినీర్లకు వెంటనే వేతనాలను చెల్లించాలని సీఎస్ శాంతికుమారిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో ఇటీవల కొత్తగా 677 మంది ఇంజినీర్లను నియమించారు. వారిలో 130 మందికి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇ చ్చారనే కారణంతో జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ఇంజినీర్లు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంటనే సీఎస్‌కు ఫోన్ చేసి తక్షణమే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నెలాఖరునాటికి పదోన్నతులు: ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తిచేస్తామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణా ఏఈఈల అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని బుధవారం ఆయన ఆవిషరించారు. జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవ వనరులు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈ పోస్టులు, 1,800 లషర్ల పోస్టుల భర్తీ చేపట్టామని, మరో 1,300 ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. విధి నిర్వహణలో నిబద్ధత, పారదర్శకతతో వ్యవహరించాలని, ఇరిగేషన్ శాఖ ప్రతిష్టను కాపాడేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఎన్సీలు జనరల్ అనిల్ కుమార్, హరిరాం, విజయభాసర్‌రెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ కే శ్రీనివాస్, అసోసియేషన్ అధ్యక్ష, కా ర్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.