‘పాలమూరు’కు అనుమతులు ఇవ్వండి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను మంజూరు చే యాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.
- ఈఏసీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగా ణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను మంజూరు చే యాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈఏసీ సమావేశంలో ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించింది. పర్యావరణ అనుమతులపై గత నెల 27న ఈఏసీ 34వ సమావేశంలోనే సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు సందేహాలు లేవనెత్తనడంతోపాటు పర్యావరణ, కమ్యూనిటీ అగ్మెంటేషన్తో పలు అం శాలపై నివేదికలను సమర్పించాలని సూచించింది. ఈఏసీ మార్గదర్శకాల మేరకు ఆయా నివేదికను ఇటీవలే తెలంగాణ సర్కారు సమర్పించింది. దీనిపై ఈఏసీ సంతృప్తిని వ్యక్తం చేసింది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడించనున్నది. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

