సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 25, 2020 , 12:21:51

ఊర్లకు వెళ్లడానికి అనుమతివ్వండి..

ఊర్లకు వెళ్లడానికి అనుమతివ్వండి..

హైదరాబాద్‌: అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న యువతీ, యువకులను హాస్టల్‌ నుంచి వెళ్లి పోవాలని ఆయా హాస్టల్స్ నిర్వాహకులు ఆదేశాలు జారీచేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజారవాణా పూర్తిగా బంద్‌ అయ్యిందనీ.. తాము హాస్టల్లోనే ఉంటామని చెప్పినా.. నిర్వాహకులు, యువత బాధను పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్స్‌ ఖాళీ చేయాలని మొండిగా వాదించేసరికి, ఎక్కడా పాలుపోని యువత పోలీసులను ఆశ్రయించారు. తమ సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు.


logo