హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : జీవో నంబర్ 46ను రద్దుచేసి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ జీవితాలతో ఆడుకున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తక్షణమే 15వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకపోతే జీవో 46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చాలామంది కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని బాధితుడు ఆకాశ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 15వేల ఉద్యోగాలు, 2022లో 16వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ పేరిట కాలయాపన చేయకుండా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగార్థుల వయస్సును 35 ఏండ్లకు పెంచాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 15 వేల కానిస్టేబుల్, వెయ్యి ఎస్సై జాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ, వర్గీకరణ ఉద్యమాలు న్యాయమైనవే ; జాతి బిడ్డల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌కు తరలిరావాలి మంద కృష్ణ మాదిగ
సిద్దిపేట అర్బన్, జనవరి 25 : తెలంగాణ ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం రెండూ న్యాయమైన పోరాటాలే అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 7వ తేదీన జరిగే ‘లక్ష డ ప్పులు, వేల గొంతుకలు’ కార్యక్రమ సన్నాహక సమావేశం శనివారం సిద్దిపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. జాతి బిడ్డల భవిష్యత్తు కో సం ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్య మంలో నాడు లగడపాటి పోషించిన పాత్రే నేడు వర్గీకరణ విషయంలో వెంకటస్వామి కుటుంబం పోషిస్తున్నదని మండిపడ్డారు. వర్గీకరణ అమలు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తు న్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. కాంగ్రెస్‌లో ఉన్న మాల నాయకులకు రేవంత్‌రెడ్డి తలొగ్గారని పేర్కొన్నారు.