హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి వచ్చిన ఖట్టర్‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌లో రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటిపారుదల(యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు నిధులు కేటాయించాని కోరారు. పీఎంఏవై 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లకు రూ.24,269 కోట్య వ్యయం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరార వేణుగోపాల్, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
.హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : స్పౌజ్ బదిలీల్లో భాషా పండితుల ఖాళీలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం(ఆర్‌యూపీపీ టీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిపివేశారని, కొన్ని జిల్లాల్లో ఖాళీలున్నా బదిలీ చేయలేని పరిస్థితి నెలకొందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని వారు విజ్ఞప్తిచేశారు