మణుగూరు టౌన్, మే 22 : ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్న చిన్నారి.. డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల ప్రకా రం.. సాంబాయిగూడెంకు చెందిన మ డకం సాయికుమార్-లిఖిత దంపతు ల కూతురు కల్నిషా అలియాస్ మిం టు (3) ఇంటి బయట తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నది.
ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కారులోకి వెళ్లింది. దానికి ఆటోమెటిక్ డోర్లాక్ సిస్టం ఉండటంతో లాక్ పడింది. రాత్రి అవుతున్నా చిన్నారి ఇంట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవడంతో చివరికి రోడ్డు పక్కన ఉన్న కారును గమనించి అందులో చూడగా.. కల్నిషా స్పృహతప్పి పడిపోయి ఉంది. వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.