Jagtial | జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్వామివారి ఊరేగింపు తీశారు. ఈ సందర్భంగా నృత్యాలు, కోలాటాల్లో ప్రజలు ఆనందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కొడిమ్యాలకు చెందిన నాగరాజు – మమత దంపతుల కుమార్తె మధుశ్రీ (11) తోటి చిన్నారులతో కలిసి కోలాటం ఆడింది. ఆ సమయంలోనే విద్యుత్ వైర్లు తగలడంతో మధుశ్రీ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. దీంతో కొడిమ్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ షాక్తో 11 ఏళ్ళ చిన్నారి మృతి
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది
స్వామివారి ఊరేగింపులో నృత్యాలు, కోలాటాల… pic.twitter.com/rfQa9ygBG7
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2025