Gadwal Vijayalakshmi | వలస కాంగ్రెస్‌కే మరో పదవి.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ!
Gadwal Vijayalakshmi | రాష్ట్ర కాంగ్రెస్‌లో వలస నేతలకు పదవుల పరంపర కొనసాగుతున్నదా? తాజాగా అసలు కాంగ్రెస్ నేతలకు మొండిచెయ్యి చూపించి, మరో వలస కాంగ్రెస్ నేతకు కీలక పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
Gadwal Vijayalakshmi | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్‌లో వలస నేతలకు పదవుల పరంపర కొనసాగుతున్నదా? తాజాగా అసలు కాంగ్రెస్ నేతలకు మొండిచెయ్యి చూపించి, మరో వలస కాంగ్రెస్ నేతకు కీలక పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్‌గా కొనసాగుతున్న గద్వాల విజయలక్ష్మికి మరో సీటు సిద్ధం చేసి పెట్టినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నెల 16 తర్వాత ఎప్పుడైనా కీలక బాధ్యతలు చేపట్టవచ్చని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ పోస్టు ఖాళీగా ఉన్నది. కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద పదవీకాలం జనవరి 7న ముగిసింది. పార్టీ కోసం కష్టపడిన తనకు 14 నెలల పదవీకాలం మాత్రమే ఇచ్చారని, కాబట్టి మరోదఫా అవకాశం ఇవ్వాలని శారద తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే, వీళ్లందరినీ పక్కనబెట్టి వలస కాంగ్రెస్ నాయకురాలికి ఈ పదవిని రిజర్వ్ చేసిపెట్టినట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈనెల 10న ఆమె పదవీకాలం ముగుస్తున్నది. దీంతో వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ని యమిస్తారని చెప్పుకుంటున్నారు. అందు కే కమిషన్ గడువు ముగిసి దాదాపు నాలు గు వారాలు గడుస్తున్నా ఇంతవరకు కొత్త చైర్పర్సన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదంటున్నారు. ఈ నెల 16న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఆమెకు పదవి కట్టబెడుతూ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విజయలక్ష్మి 2021 ఫిబ్రవరి 11న బీఆర్ఎస్ పార్టీ తరఫున జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేశవరావు కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు విజయలక్ష్మి కూడా పార్టీ ఫిరాయించింది.
సీనియర్లకు తీవ్ర అన్యాయం
మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని వలస కాంగ్రెస్ నేతలకు కట్టబెడతారన్న ప్రచారంతో అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కీలక పదవులన్నింటిలో వలస నేతలే తిష్ట వేస్తున్నారని ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనుల్లోనూ వలస నేతలకే ప్రాధాన్యం పెరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

