హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూ టీఎస్ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ (జీహెచ్ఎంఏ) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్ ఆదివారం మహేందర్‌రెడ్డిని కలిసి మద్దతు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంగ మహేందర్‌రెడ్డి గెలుపునకు కృషిచేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, జీహెచ్ఎంఏ కోశాధికారి తుకారం, 13 జిల్లాల అధ్యక్షప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.