హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి రాజ్‌భవన్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో జరగనున్న వర్సిటీ 26వ స్నాతకోత్సవానికి అనుమతి కోరడంతో పాటు కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రిజిస్ట్రార్ డా ఎల్ విజయకృష్ణారెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ భోజు శ్రీనివాస్, ప్రజా సంబంధాల అధికారి డా పీ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.